మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. నీతి ఆయోగ్ లో పలు ఖాళీలు వున్నాయి. ఆయా పోస్టుల భర్తీకి నీతి ఆయోగ్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
మరి ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ రిక్రూట్‌మెంట్ కాంట్రాక్ట్ ప్రతిపాదికగా వుంది. కాంట్రాక్ట్ సమయం వచ్చేసి రెండు సంవత్సరాలు. దీన్ని మీరు మరో మూడు ఏళ్ళకి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. పోస్టుల వివరాలను చూస్తే..
యంగ్ ప్రొఫెషనల్స్ 22, కన్సల్టెంట్స్ 6 పోస్టులు కలిపి మొత్తం 28 పోస్టులను భర్తీ చేస్తోంది. సైన్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, ఆపరేషన్స్ రీసెర్చ్ , పబ్లిక్ పాలసీ, డెవలప్‌మెంట్ స్టడీస్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ , మేనేజ్‌మెంట్‌తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతలు ఉంటే అప్లై చేసుకోవచ్చు.
వయస్సు వివరాలను చూస్తే..45 సంవత్సరాలు మించి వుండకూడదు. సాలరీ 80 వేల నుండి 1.45 లక్షల రూపాయల వరకు వస్తుంది. విద్యార్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వేరు వేరు పోస్టులకి వేరు వేరు విద్యార్హతలు వున్నాయి. పూర్తి వివరాలను niti.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.