విశాఖపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు… ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ కార్యాలయం పలు ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. దీనిలో మొత్తం 53
ఖాళీలు వున్నాయి.

ఆడియో మెట్రీషియన్‌, రేడియోగ్రాఫర్లు, థియేటర్‌ అసిస్టెంట్‌, ఫార్మసిస్ట్‌, పోస్టు మార్టం అసిస్టెంట్, ల్యాబ్‌ టెక్నీషిన్‌, ల్యాబ్‌ అటెండెంట్, కౌన్సెలర్‌, బయో మెడికల్‌ ఇంజనీర్‌, ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌ మొదలైన పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా ఏపీ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ కార్యాలయం భర్తీ చేయనుంది. వయస్సు వివరాల లోకి వెళితే.. అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

శాలరీ గురించి చూస్తే.. నెలకు రూ.15,000ల నుంచి రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అయితే అప్లై చేసుకోవాలని అనుకునే వారు పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా, బీఎస్సీ, బీటెక్‌ ప్యాస్ అయ్యి ఉండాలి.

అలానే సంబంధిత పనిలో అనుభవంతోపాటు ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయ్యి ఉండాలి. అప్పుడే దరఖాస్తు చేసుకోవడానికి అవుతుంది. ఇక ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది చూస్తే.. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 31, 2022. పూర్తి వివరాలను https://visakhapatnam.ap.gov.in/ లో చూడచ్చు.

అడ్రస్‌: District Coordinator of Hospital Services (APVVP), Government Hospital, Pendurti, Visakhapatnam.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version