నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తాజాగా ఒక నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలోని స్వతంత్ర ప్రతిపత్తి హోదా కలిగిన సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రిసెర్చ్ (ఎన్‌సీపీఓఆర్) ఖాళీగా ఉన్న 85 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్, ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి. అయితే అభ్యర్థులకు ఎలాంటి రాతపరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలని https://ncpor.res.in/ వెబ్‌సైట్ లో చూడొచ్చు. ఎంపికైనవారు గోవాలో పనిచేయాల్సి ఉంటుంది.
ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. ప్రాజెక్ట్ సైంటిస్ట్-I – 42, ప్రాజెక్ట్ సైంటిస్ట్-II – 21, ప్రాజెక్ట్ సైంటిస్ట్-III – 3, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్- 4, ఆఫీసర్- 5, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్- 10 వున్నాయి. మెరెయిన్ సైన్స్, మైక్రోబయాలజీలో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
జూలై 15, 2021 దరఖాస్తులకు చివరి తేదీ. దరఖాస్తుల ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు. ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.వెబ్‌సైట్ లింక్ https://ncpor.res.in/