బీఈ/ బీటెక్‌ అర్హతతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ (ఇండియా) లిమిటెడ్‌ పలు ఖాళీలని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, అసిస్టెంట్ మేనేజర్‌ తదితర పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఇక అర్హత వివరాల లోకి వెళితే.. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ ఏఎంఐఈ/ సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ/ఎంసీఏ/బీఆర్క్‌ లేదా తత్సమాన కోర్సు ని పూర్తి చేసి ఉండాలి. దానితో పాటుగా పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఇక వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్ధుల వయసు ఫిబ్రవరి 13,2023వ తేదీ నాటికి బట్టి 32 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే వేరు వేరు పోస్టులకి వేరు వేరు అర్హతలు ఉండాలి చూసుకోండి. ఈ పోస్టులకి ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంది. అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 13, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అవకాశం ఉంది కనుక ఈలోగా అప్లై చేసుకోవచ్చు.

షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక శాలరీ విషయానికి వస్తే.. నెలకు రూ.40,000ల నుంచి రూ.70,000ల వరకు ఇస్తారు. పూర్తి వివరాలని https://epi.gov.in/content/ లో చూసి అప్లై చేసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version