అప్ఘానిస్థాన్ దేశంలో పరిస్థితులు దారుణం గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. రానున్న 24 నుంచి 36 గంటల్లోనే కాబుల్ ఎయిర్ పోర్టు పై మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు తమకు కచ్చితమైన సమాచారం ఉందని తెలిపారు. సైనిక కమాండర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని వెల్లడించారు.
ఈ నేపథ్యం లో విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో ఎవరూ ఉండొద్దని ఆప్ఘాన్ లో ఉన్న అమెరికా సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యం లోనే అప్ఘాన్ లో ఉన్న సైనికులను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాని బైడెన్ సైనిక ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే అప్ఘాన్ లో ఉన్న అమెరికా పౌరులను రక్షించేందుకు కావాల్సిన అన్ని వసతులు మరియు సహకారాలను అందించాలన సూచించారు. కాగా.. నాలుగు రోజులు కింద కాబుల్ ఎయిర్ పోర్టుపై దాడి జరిగిన సంగతి తెలిసిందే.