అయ్యన్న అరెస్ట్ చూపి బీసీలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు : మంత్రి జోగి రమేశ్‌

-

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడితో పాటు ఆయన కుమారుడు రాజేశ్ ను భూ ఆక్రమణ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నిరసనలు, అయ్యన్న అరెస్ట్ పై చంద్రబాబు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడు 420 పని చేస్తే… దానితో బీసీలకేం సంబంధం ఉందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటే కేసులు పెట్టకూడదా? అని కూడా ప్రశ్నించారు జోగి రమేశ్. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ తీరుపై మండిపడ్డారు జోగి రమేశ్. అయ్యన్న అరెస్ట్ చూపి బీసీలను రెచ్చగొట్టాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చూస్తున్నారని రమేశ్ ఆరోపించారు.

అక్రమాలకు పాల్పడే నేతలపై కేసులు పెట్టొద్దని చెబుతారా? అంటూ ప్రశ్నించిన రమేశ్… టీడీపీకి సొంత రాజ్యాంగం ఏమైనా రాశారా? అని నిలదీశారు జోగి రమేశ్. అయినా అయ్యన్నను అరెస్ట్ చేస్తే బీసీల గొంతు నొక్కడం ఏమిటన్నారు. ఎవవి విషయంలో అయినా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న రమేశ్… చంద్రబాబు ఎంత లేపినా టీడీపీ లేవదని వ్యాఖ్యానించారు జోగి రమేశ్. ఇక పవన్ కల్యాణ్ ఇంటి వద్ద రెక్కీ జరిగిందన్న వార్తలపైనా మంత్రి రమేశ్ స్పందించారు. పవన్ కల్యాణ్ లాంటి నేతల గురించి ఆలోచించే సమయం తమకు లేదని జోగి రమేశ్ అన్నారు. ఎంతసేపూ తాము ప్రజలకు ఏ మేర సంక్షేమం అందించామన్న దానిపైనే ఆలోచిస్తామన్నారు పవన్ కల్యాణ్ ఇంటి వద్ద ఎవరో ఏదో చేస్తే తమకేమి సంబంధం అని ప్రశ్నించారు జోగి రమేశ్. శత్రువు కూడా బాగుండాలి… ఎదుటి పార్టీ కూడా బాగుండాలి అని కోరుకునే మనస్తత్వం తమదని ఆయన చెప్పారు. ప్రజా సంక్షేమం వద్దే తాము ఇతర పార్టీలతో పోరాటం చేస్తామన్నారు జోగి రమేశ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version