‘విలువల’ విషయం లో వెన్నుపోటు తో బాధపడుతున్న జర్నలిజం !

-

రాజకీయ నాయకులను ప్రశ్నిస్తాం, సమాజాన్ని ఉద్దరిస్తాం అంటూ తెగ ఊదరగొట్టే పత్రిక యజమానులు కరోనా వైరస్ దెబ్బకి జర్నలిస్టులను నట్టేట ముంచుతున్నాయి. సమాజానికి నీతులు చెప్పే పత్రిక యాజమాన్యం అర్ధాంతరంగా కరోనా వైరస్‌ బూచి చూపించి ‘కాస్ట్‌ కటింగ్‌’ పేరుతో జర్నలిస్టుల్ని రోడ్డున పడేస్తున్నాయి. ప్రజా సమస్యలను ప్రశ్నించే పత్రిక యాజమాన్యాలు ప్రస్తుతం తమ దగ్గర పనిచేసే సీనియర్ జర్నలిస్టుల ను వెన్నుపోటు పొడుస్తున్నారు. అర్ధాంతరంగా ఉద్యోగాల నుండి తొలగిస్తూ నట్టేట ముంచుతున్నారు. దీంతో చాలా వరకు సీనియర్ జర్నలిస్టులు తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా వేదికగా తమ బాధను వెళ్లబుచ్చుతున్నారు.Journalists need a point of view if they want to stay relevantకొత్తతరం జర్నలిస్టులు తక్కువ ఖర్చుతో దొరకవచ్చు..ఆయా రాష్ట్ర రాజకీయ పార్టీలకు అనుకూలంగా వార్తలు రాయడం లో వాళ్లు సిద్ధహస్తులై వుండొచ్చు. కానీ ఈ కొత్త విధానం జర్నలిజం విలువలకు వెన్నుపోటు పొడవడమే’ అని అంటున్నారు. ‘కాస్ట్‌ కటింగ్‌’ పేరుతో పత్రికా రంగాన్నే నమ్ముకున్న సీనియర్ జర్నలిస్టులను అర్ధాంతరంగా తొక్కేయడం వల్ల ఆ పత్రికా యాజమాన్యాలు మూల్యం చెల్లించుకుంటారు అని అంటున్నారు.

 

ప్రస్తుతం జనమంతా విలువలు మరియు విశ్వసనీయత విషయంలో మీడియా గాని పత్రికా గాని చూపించే వాటిని నమ్మటం మానేశారని సోషల్ మీడియా వైపే మొగ్గు చూపుతున్నారంటూ ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు అంటున్నారు. ప్రజా సమస్యలను అదేవిధంగా ప్రభుత్వాలను సూటిగా ఏ విధంగా ప్రశ్నించాలి, ఏ కోణంలో ప్రశ్నించాలి అన్న దాని విషయంలో సరైన స్పష్టత ఉన్న సీనియర్ జర్నలిస్టులకు ఈ విధంగా హఠాత్తుగా ఉద్యోగాలు తొలగించడం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కి విరుద్ధం అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version