మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారంపై స్పందించిన జనసేనాని

-

హైదరాబాదులో అమ్నీషియా పబ్‌ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ స్పందిస్తూ.. ఈ ఘటన దుర్మార్గమని, తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు పవన్‌. అల్లారుముద్దుగా పెంచుకునే పిల్లలను ఎవరన్నా ఒక దెబ్బ కొడితే విలవిల్లాడే తల్లిదండ్రులు, తమ బిడ్డపై సామూహిక అత్యాచారం జరిగితే ఎంత క్షోభకు గురవుతారో ఊహించగలను అంటూ పవన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఇలాంటి ఘోర స్థితి పగవారికి కూడా రాకూడదని భారతీయులు కోరుకుంటారని వెల్లడించారు పవన్‌. అమ్మాయిలపై అత్యాచారాలు నిరోధించాలంటే, ఇప్పుడున్న శిక్షలే కాకుండా, మృగాళ్లకు అత్యాచారాల ఆలోచనలే రాకుండా సంస్కరించాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు పవన్‌. ఈ కేసులో నిందితులు ఎవరైనా సరే చట్టం ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బాధిత బాలిక, ఆమె కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా నిలవాలని పేర్కొన్నారు పవన్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version