తెలంగాణకు మొదట మద్దతు పలికింది బీజేపీనే : జేపీ నడ్డా

-

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను వరంగల్‌లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొదట మద్దతు ఇచ్చింది బీజేపీనే అని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకై గల్లీలోనూ, ఢిల్లీలోనూ బీజేపీ ఫైట్ చేసిందన్నారు జేపీ నడ్డా. బీజేపీ మద్ధతు తోనే పార్లమెంట్‌లో తెలంగాణ పాస్ అయిందని గుర్తు చేశారు నడ్డా. త్వరలోనే కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు ఇంట్లో కూర్చోబెడతారు అని జేపీ నడ్డా అన్నారు. చివరి నిజాం కూడా ఇలాంటి ఆంక్షలే పెట్టారని నాటి ఆంక్షలను గుర్తు చేశారు నడ్డా. మీర్ ఉస్మాన్ అలీఖాన్ దారిలోనే కేసీఆర్ పయనిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. నిజాం తరహాలోనే కేసీఆర్‌ను ప్రజలు ఇంట్లో కూర్చోబెడతారని జేపీ నడ్డా అన్నారు.

బీజేపీ సభను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ సర్కార్ కుట్రలు చేసిందని జేపీ నడ్డా ఆరోపించారు. కానీ, హైకోర్టు అనుమతితో సభ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అడుగడుగునా ఆంక్షలు పెట్టారని విమర్శించారు నడ్డా. 144 సెక్షన్ ఉందని జనాన్ని రాకుండా అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ బందీ చేశారని అన్నారు జేపీ నడ్డా. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపడమే ప్రజాసంగ్రామ యాత్ర సంకల్పం అని జేపీ నడ్డా అన్నారు. ఆర్ట్స్ కాలేజీలో బీజేపీ సభకు అనుమతి ఇవ్వకపోవడంపై ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అంధకారంలో ఉందన్నారు. అంధకారమైన తెలంగాణలో వెలుగులు నింపడానికే బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారని అన్నారు జేపీ నడ్డా.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version