వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీర్పు, మాజీ మంత్రికి ఏడేళ్ళ జైలు శిక్ష…!

-

కరోనా లాక్ డౌన్ లో ఇప్పుడు కోర్టులు కూడా చాలా జాగ్రత్తగా పని చేస్తున్నాయి. ఎక్కడా కూడా కోర్ట్ సిబ్బందికి కరోనా సోకకూడదు అని సుప్రీం కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. దీనితో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్ట్ లు కూడా ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులను విచారిస్తున్నాయి. సుప్రీం కోర్ట్, రాష్ట్ర హైకోర్ట్, స్పెషల్ కోర్ట్ లు అన్నీ కూడా ఇదే విధంగా ఇప్పుడు కేసులను విచారిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఇలా విచారించే ఒక మాజీ మంత్రికి స్పెషల్ కోర్ట్ ఏడేళ్ళ పాటు జైలు శిక్ష విధించింది. జార్ఖండ్‌ రాష్ట్ర మాజీ మంత్రి “అనోష్ ఎక్కా”కి.. మనీలాండరింగ్ కేసులో ఏడేళ్ళ శిక్ష పడింది. గురువారం రాంచీలోని పీఎంఎల్ఏ స్పెషల్ కోర్టు మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి ఈ తీర్పు ఇచ్చింది. తీర్పును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జస్టిస్‌ ఏకే మిశ్రా వెల్లడించారు.

అలాగే సదరు మాజీ మంత్రి గారికి రూ.2 కోట్ల జరిమానా కూడా విధించడం గమనార్హం. జరిమానా కట్టకపోతే మాత్రం మరో ఏడాది పాటు జైలు జీవితాన్ని అనుభవించాలని స్పష్టం చేసింది కోర్ట్. మాజీ మంత్రికి చెందిన ఆస్తులన్నింటినీ ఈడీ ఇటీవల అటాచ్‌ చేసింది. ఆస్తులు అన్నీ కూడా ఈడి జత్ప్తులోనే ఉంటాయని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news