పాక్‌ దేశం కోసం, భారత్ రికార్డుల కోసం ఆడుతుంది : ఇంజిమామ్ ఉల్ హక్

-

భారత్ మీద పాకిస్తాన్ ఎంత అక్కసు వెళ్లగక్కుతుందో ఆ దేశ ఆటగాళ్ళు కూడా అదే స్థాయిలో కక్కుతూ ఉంటారు. పదే పదే భారత్ మీద కొందరు ఆటగాళ్ళు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు. అందులో క్రికెటర్లు ఎక్కువగా ఉంటారు. క్రికెట్ నుంచి తప్పుకుని పనీ పాటా లేని వాళ్ళు అందరూ భారత్ మీద విమర్శలు చేయడానికి సిద్దమవుతు ఉంటారు. తాజాగా ఆ దేశ క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ ఇంజిమామ్ ఉల్ హక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.

భారత ఆటగాళ్ళు సెంచరి కోసం ఆడతారు అంటూ వ్యాఖ్యానించాడు. ఆ దేశ మాజీ ఆటగాడు రమీజ్ రాజా యుట్యూబ్ ఛానల్ టాక్ షోలో పాల్గొన్న ఇంజిమాం ఈ వ్యాఖ్యలు చేసాడు. తాను ఆడే రోజుల్లో భారత ప్లేయర్లు ఎప్పుడూ కూడా జట్టులో చోటు సంపాదించుకోవడం కోసమే ఆడేవారని అన్నాడు. జట్టు కోసం ఆడిన దాఖలాలు లేవని సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇండియన్ ప్లేయర్స్ తమ స్వలాభం కోసం, సొంత రికార్డులే లక్ష్యంగా బ్యాటింగ్ చేస్తారని అన్నాడు.

కానీ పాకిస్తానీ క్రికెటర్లు జట్టు ప్రయోజనాల కోసమే ఆడేవారని, జట్టు గెలుపే ధ్యేయంగా పాకిస్తానీలు శ్రమించేవారని అతను వ్యాఖ్యానించడం గమనార్హం. ఒక సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేసినవారికే మరో సిరీస్‌లో చోటు దక్కుతుందని అతను అభిప్రాయపడ్డాడు. పేపర్ మీద పులులుగా కనిపించే ఇండియన్ బ్యాటింగ్ లైనప్, ఆన్ ఫీల్డ్‌కి వచ్చేసరికి మొత్తం మారిపోతుందన్నాడు అతను. వారంతా కూడా తమ వ్యక్తిగత ప్రదర్శనలకు ప్రాముఖ్యత ఇచ్చి.. జట్టు ఓడిపోతున్నా కూడా పట్టించుకునే వారు కాదని వ్యాఖ్యానించాడు. మరి వాళ్ళు ఫిక్సింగ్ చేసే వాళ్ళు. దీని గురించి కూడా చెప్పి ఉంటే బాగుంటుంది అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news