అసెంబ్లీలో మంత్రి కొండా సురేఖకు షాకిచ్చిన జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే

-

అటవీశాఖ మంత్రి కొండా సురేఖకు సొంత పార్టీ ఎమ్మెల్యే అసెంబ్లీ వేదికగా షాకిచ్చారు. మంత్రి కంట్రోల్‌లో ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సీరియస్ అయ్యారు.తన నియోజకవర్గం పరిధిలోని ఫార్మా కంపెనీలు విపరీతంగా వ్యర్థ్యాలను వదులుతున్నాయని, ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

స్పీకర్ సాక్షిగా మంత్రి దృష్టికి తీసుకెళ్లిన జడ్చర్ల ఎమ్మెల్యే .. నియోజకవర్గ రైతులు ఫార్మా కంపెనీ వ్యర్ధాల వలన పంటలు పండక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. రైతులు పలుమార్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని, సీసీ కెమెరాలు పెట్టుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారని విమర్శించారు. సొంత పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో మంత్రి కొండా సురేఖ ఇరకాటంలో పడినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news