లగచర్ల ఇష్యూ… బీఆర్ఎస్ తీర్మానాన్ని తిరస్కరించిన అసెంబ్లీ స్పీకర్

-

బీఆర్ఎస్‌ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. బీఆర్ఎస్ ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌. లగచర్ల రైతుల గురించి చర్చించాలని బీఆర్ఎస్ ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో నినాదాలు చేశారు.

The speaker rejected the adjournment motion proposed by the BRS party to discuss the farmers of Lagacharla

ఇక తెలంగాణ శాసనసభ కార్య విధాన మరియు కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం భారత రాష్ట్ర సమితి శాసనసభా పక్షం తరఫున ఆర్ధిక మంత్రి గారిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.

తెలంగాణ అప్పులపైన శాశన సభను, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించిన ప్రభుత్వంపైన ప్రివిలేజ్ మోషన్ కు అనుమతి ఇవ్వాలని కోరింది బీఆర్ఎస్. అర్ బిఅర్ఐ నివేధికలో తెలంగాణ అప్పులు కేవలం 3.89 లక్షల కోట్లు అని స్ఫష్టం చేస్తే ప్రభుత్వం మాత్రం 7 లక్షల కోట్ల అప్పులు అంటూ తప్పుదోవ పట్టించినందున సభాహక్కులు నోటీలు ఇస్తున్నట్లు తెలిపింది.

 

Read more RELATED
Recommended to you

Latest news