ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ పై తీర్పు రిజర్వ్

-

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. అవినాష్ రెడ్డి పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తనపై చర్యలు తీసుకోవద్దని, తదుపరి విచారణపై స్టే ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ విచారించిన కోర్టు.. తీర్పును వెల్లడించే వరకు అరెస్టు చేయవద్దని సిబిఐ ని ఆదేశించింది.

అవినాష్ కు సంబంధించిన 10 డాక్యుమెంట్లు, 35 వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించిన సిబిఐ.. అవినాష్ పై తీవ్ర చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇవ్వద్దని న్యాయస్థానాన్ని కోరింది. హత్య సమయంలో సాక్ష్యాల ధ్వంసంలో అవినాష్ రెడ్డి పాత్ర ఉందని సిబిఐ అధికారులు కోర్టుకు తెలిపారు. ఇక సిబిఐ ఆఫీసు వద్ద అవినాష్ ప్రెస్ మీట్ నిర్వహించడం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

దర్యాప్తు జరుగుతుండగా సిబిఐ ఆఫీస్ వద్ద ప్రెస్ మీట్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. ఇక రేపు సిబిఐ విచారణకు హాజరు కాకుండా అనుమతి ఇవ్వాలని ఎంపీ అవినాష్ రెడ్డి కోర్టును కోరారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున హాజరు కాలేనని, అందుకు అనుమతి ఇవ్వాలని అవినాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఐతే సిబిఐనే కోరాలని అవినాష్ కు హైకోర్టు సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version