ఐక‌మ‌త్యంగా దూకాయి.. ప్రాణాలు నిలుపుకున్నాయి.. చిరుత‌ల సాహ‌సం

-

ఐక‌మ‌త్యంగా ఉంటే ఎంత బ‌ల‌మో చాలాసార్లు చాలా క‌థ‌లు వింటే మ‌న‌కు అర్థ‌మ‌యిపోయింది. ఎంతటి శ‌త్రువు అయినా స‌రే చిన్న జీవులు అన్నీ క‌లిసి పోతే వాటిక త‌లొగ్గ‌క త‌ప్ప‌దు మ‌రి. కానీ కొన్నిసార్లు ఆ ఐక‌మత్యం లేకుండా చిన్న జంతువు కూడా భ‌య‌పెడుతుంది. వంద జీవుల‌ను ఒక సింహం భ‌య‌పెడుతుందంటే దాని గొప్ప కాదు ఆ వంద జీవులు ఒక్క‌టిగా లేవ‌ని అర్థం. ఇప్పుడు ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా ఓ సంఘ‌ట‌న జ‌రిగింది. కెన్యా దేశంలోని మాసాయ్‌ మారా నేషనల్‌ రిజర్వు ఫారెస్ట్ లో ఇప్పుడు కుండపోత వాన కురుస్తోంది.

Cheetahs

దీంతో ఈ వాన‌ల‌కు తాలేక్‌ నది తీవ్రంగా ప్ర‌వ‌హిస్తోంది. గ‌తంలో ఎన్న‌డూ లేనంత ఉగ్రరూపం దాల్చిందనే చెప్పాలి. ఇక ఇలాంటి స‌మ‌యంలో ఒడ్డుకు ఇటు వైపు ఉన్న ఐదు చిరుత పుల‌లు ఎలాగైనా స‌రే న‌దిని దాటేందుకు బాగానే ప్ర‌య‌త్నిస్తున్నాయి. కానీ ధైర్యం చాల‌క అటూ ఇటూ తిరుగుతున్నాయి. కార‌ణం ఏంటంటే ఆ నదిని దాటాలనుకుంటే వ‌ర‌ద ఏ క్ష‌ణంలో మింగేస్తుందో తెలియ‌దు.

పైగా ఇప్ప‌డు న‌ది తీవ్రంగా ప్ర‌వ‌హించ‌డంతో ఆ చిరుత‌లు భ‌య‌ప‌డిపోతున్నాయి. ఇంకోవైపు ఆ నదిలోని భయంకరమైన మొసళ్లు కూడా ప్రాణాలు తీసేందుకు రెడీగా ఉంటాయి. ఈ కార‌ణంగా ఎలాగైనా నదిని దాటాలి అనుకుని ఒకేసారి భయం వీడి ఒక్కటిగా దూకాయి. ఇంకేముంది ఐక‌మ‌త్యంగా ఉండ‌టంతో వరద భ‌యం వాటిని ఏమీ చేయ‌లేదు. మొస‌ళ్లు కూడా వాటి ద‌గ్గ‌ర‌కు రాలేదు. ఇలా కలిసికట్టుగా ఆ చిరుత‌లు అన్నీ కూడా ఆ నదిని దాటాయి. క్షేమంగా త‌మ రాజ్యానికి చేరుకున్నాయి. ఈ చిరుత‌లు ఐక‌మ‌త్యంగా ఉండ‌టంతో ప్రాణాలు ద‌క్కించుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version