రాడిసన్ పబ్ కేసులో ట్విస్ట్..జూనియర్ ఆర్టిస్ట్ సెల్ఫీ వీడియో రిలీజ్ !

-

రాడికల్‌ పబ్‌ లో నిన్న జరిగిన సంఘటన రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ కేసులో చిక్కుకున్న జూనియర్ ఆర్టిస్ట్ కల్లపు కుషితా సెల్ఫీ వీడియో ద్వారా దీనిపై క్లారిటీ ఇచ్చింది. లేట్ హవెర్స్ పబ్ లో ఉండటం మా తప్పు కాదు..! అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారు అన్న విషయం మాకు తెలియదని పేర్కొంది. తెలిస్తే మేము అక్కడికి ఎందుకు వెళ్తాము…? అక్కడ రష్ ఎక్కువగా ఉన్నమాట వాస్తవమని.. డ్రగ్స్ అక్కడ వినియోగిస్తున్నారని మాకు తెలీదని ఆవేదన వ్యక్తం చేసింది.

మా ఫ్రెండ్స్ పార్టీ అయ్యాక బయటకి వెళదామని అనుకునే లోపే పోలీసులు వచ్చారని.. అందరిని బాధ్యులను చేయడం….పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం సరికాదని పేర్కొంది. పోలీసులు వచ్చారు మా డిటైల్స్ తీసుకున్నారు…! మేము పోలీసులకు సహకరించము..కావాల్సి వస్తే మా రక్త నమూనాలు (శాంపిల్స్) తీసుకోండి , మేము ఎప్పుడైనా శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధమేనని స్పష్టం చేసింది.

దీని అడ్డు పెట్టుకొని ఇలా చేయడం సరికాదని.. మీడియా వాళ్లు కొంచం సమన్వయం పాటించాలన్నారు. పబ్ కి వచ్చిన వాళ్ళని అందరిని బద్నామ్ చేయడం సరికాదని..మేము ఇప్పుడు ఇప్పుడే సినిమా రంగంలో ఎదుగుతున్నామని వెల్లడించింది. మేము జస్ట్ ఆఫ్టర్ పార్టీ కి వెళ్ళామని.. దయచేసి మీడియా వారు మమ్మల్ని బద్నాం చేయకండంటూ జూనియర్ ఆర్టిస్ట్ కల్లపు కుషితా వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news