అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 62 మంది జూనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్వర్వులు జారీ చేసింది. మూడు రోజుల క్రితం 68 జూనియర్ సివిల్ జడ్జి భర్తీకి ప్రకటన వెలువడింది. నేరుగా నియామకం ద్వారా 55 బదిలీల ద్వారా 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. వారం రోజులుగా 25 మంది సీనియర్ సివిల్ జడ్జిలను హైకోర్టు బదిలీ చేసింది. ఆగస్టు 2లోపు వారు ప్రస్తుతం పని చేస్తున్న స్థానాలను వదిలి కొత్తగా పోస్టింగ్ వచ్చిన చోట బాధ్యతలు స్వీకరించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో 62 మంది జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ
-