అన్న బాటలో చెల్లెలు…వర్కౌట్ అవ్వదా?

-

దివంగత వైఎస్సార్ వారసులు అటు ఏపీలో, ఇటు తెలంగాణలో రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే. 10 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన జగన్, వైసీపీ పెట్టి 2014లో ఫెయిల్ అయిన 2019లో సక్సెస్ అయ్యారు. అయితే జగన్ పార్టీ తెలంగాణలో పూర్తిగా దుకాణం మూసేసి, ఏపీలో మాత్రమే సత్తా చాటుతుంది. ఈ క్రమంలోనే జగన్ సోదరి షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

తాను తెలంగాణ కోడలిని అని, ఇక్కడ కూడా రాజన్న రాజ్యం తీసుకోస్తానని చెప్పి, వైఎస్సార్ తెలంగాణ పేరిట పార్టీ పెట్టి రాజకీయాలు చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్‌పై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. గతంలో జగన్ చేసినట్లే షర్మిల కూడా ఆత్మహత్య చేసుకున్న రైతు, నిరుద్యోగుల కుటుంబాలని ఓదార్చే కార్యక్రమం చేస్తున్నారు. అలాగే నిరసన దీక్షలు చేస్తున్నారు.

అటు పార్టీ అంతర్గత వ్యవహారానికి వస్తే, రాజకీయంగా తనకంటూ ఓ ప్రత్యేక శైలి ఉండాలని షర్మిల చూస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ‘షర్మిలమ్మ’ అనే బ్రాండ్ తగిలించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ అభిమానులంతా ‘షర్మిలమ్మ’ అని పిలవాలని పార్టీలోని కీలక నాయకులు ద్వారా ఆదేశాలు వెళ్ళినట్లు తెలుస్తోంది. అలా పిలిస్తేనే హుందాతనంగా ఉంటుందని భావిస్తున్నారట.

కానీ ఏపీలో వర్కౌట్ అయినట్లు, తెలంగాణలో ఇలాంటి రాజకీయాలు వర్కౌట్ కావని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో వైసీపీ అభిమానులు ‘జగనన్న’ అని పిలుచుకుంటారని, కానీ అలాంటి పిలుపులు తెలంగాణలో పెద్దగా సెట్ కావని అంటున్నారు. కాకపోతే ఇప్పటికే కొందరు షర్మిలక్క అంటూ పిలవడం మొదలుపెట్టారు. దీని వల్ల తెలంగాణలో పెద్దగా ఒరిగేదేమీ లేదని చెబుతున్నారు.  మొత్తానికైతే జగన్ బాటలో వెళ్ళేందుకు చూస్తున్న షర్మిలకు తెలంగాణలో సెంటిమెంట్లు వర్క్ అవ్వవనే చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version