కేంద్రంలో జూనియర్ ఇంజినీర్ పోస్టులు !

-

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల
దేశంలోని వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు/సంస్థల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.

పోస్టు: జూనియర్ ఇంజినీర్
మొత్తం ఖాళీలు: ప్రస్తుతం వెల్లడించలేదు.
తర్వాత వెల్లడిస్తారు. (ఈ సంఖ్య భారీగానే ఉంటుంది)
పోస్టులు భర్తీ చేసే సంస్థలు/డిపార్ట్మెంట్లు: సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, మిలటరీ ఇంజినీర్ సర్వీస్, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్టు, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్, డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరన్స్ (నావల్), నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ వంటి మొత్తం 19 శాఖల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత బ్రాంచీల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత. కొన్ని శాఖల్లో పోస్టులకు అనుభవం కూడా ఉండాలి.
వయస్సు: 2021 జనవరి 1 నాటికి నాటికి వాటర్ కమిషన్, పబ్లిక్ వర్క్స్ పోస్టులకు 32 ఏళ్లు; మిగిలినవాటికి 30 ఏళ్లు మించరాదు.
ఎంపికవిధానం: కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష, డిస్క్రిప్టివ్ టెస్ట్ ఆధారంగా చేస్తారు.
పరీక్షతేదీ: పేపర్-1 ను 2021 మార్చి 22 నుంచి 25 వరకు నిర్వహిస్తారు.
పేపర్-2(కన్వెన్షనల్) పరీక్ష తేదీని తర్వాత వెల్లడిస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో చేసుకోవాలి
ఫీజు: రూ.100
చివరితేది: అక్టోబర్ 30
వెబ్సైట్: https://ssc.nic.in/

Read more RELATED
Recommended to you

Exit mobile version