జూనియ‌ర్ ఎన్‌టీఆర్ త‌క్కువోడేం కాదు.. ల‌క్ష్మీపార్వ‌తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

-

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన ల‌క్ష్మీస్ ఎన్‌టీఆర్ చిత్ర ట్రైల‌ర్ గ‌త రెండు రోజుల కింద‌టే విడుద‌లై సంచ‌నాలు సృష్టిస్తోంది. ఆ ట్రైల‌ర్ టీడీపీ శ్రేణుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంటే.. మ‌రో వైపు ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీ వైకాపాకు చెందిన నాయ‌కులు మాత్రం సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఇక వ‌ర్మ అభిమానులు మాత్రం చాలా రోజుల త‌రువాత అస‌లు సిస‌లైన సినిమాను వ‌ర్మ తీశారంటూ ఆయ‌న్ను పొగ‌డ్త‌ల్లో ముంచెత్తుతున్నారు. ఈ క్ర‌మంలోనే ల‌క్ష్మీస్ ఎన్‌టీఆర్ చిత్రంపై అంద‌రూ ర‌క ర‌కాలుగా స్పందిస్తున్నారు.

అయితే ఈ సినిమా ట్రైల‌ర్‌ను చూసిన ల‌క్ష్మీపార్వతి కూడా మీడియాతో మాట్లాడారు. సినిమాను బాగా తీశారంటూ ఆమె చిత్ర యూనిట్‌ను మెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఎన్‌టీఆర్ జీవితంలో దాచిపెట్ట‌బ‌డిన కొన్ని ర‌హ‌స్యాల‌ను ప్రేక్ష‌కులు తెలుసుకుంటారంటూ ఆమె కామెంట్ చేశారు. అలాగే ఈ సినిమా తీసినందుకు ద‌ర్శ‌కుడు వ‌ర్మ‌కు ఆమె కృత‌జ్ఞ‌త‌లు కూడా తెలిపారు.

ఇక ల‌క్ష్మీపార్వ‌తి ఈ సినిమా ట్రైల‌ర్ చూసిన సంద‌ర్బంగా జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌పై కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అప్ప‌ట్లో.. జూనియ‌ర్ ఎన్‌టీఆర్ చిన్న‌త‌నంలో.. తాను ఎన్‌టీఆర్‌ను పెళ్లి చేసుకున్న‌ప్పుడు ఒక‌సారి జూనియర్ ఎన్‌టీఆర్ త‌మ ఇంటికి వ‌చ్చాడ‌ని, అత‌ను త‌న‌కు కూడా మ‌న‌వ‌డ‌నే భావ‌న‌తో చేర‌దీశాన‌ని ల‌క్ష్మీపార్వ‌తి తెలిపారు. వాడు (జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌) త‌న తాత‌ను, త‌న‌ను ప‌క్క‌న నిలబెట్టి త‌మ‌తో క‌లిసి ఫొటో కూడా దిగాడ‌ని, అయితే టీడీపీ ప్ర‌భుత్వం ప‌డిపోయాక‌, ఎవరో చెప్పిన మాట‌ల‌ను వాడు న‌మ్మి త‌మ‌తో క‌లిసి తీయించుకున్న ఫొటోను చింపేశాడ‌ని ల‌క్ష్మీపార్వ‌తి తెలిపారు.

జూనియ‌ర్ ఎన్‌టీఆర్ త‌క్కువోడేం కాద‌ని, అత‌న్ని చాలా బాగా చూసుకున్నాన‌ని, కానీ తానంటే అత‌నికి ద్వేషం ఏర్పడింద‌ని ల‌క్ష్మీ పార్వ‌తి తెలిపారు. జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌తో ఆ రోజుల్లో త్యాగ‌రాజ గాన‌స‌భ‌లో అరంగేట్రం చేయించాన‌ని, అయినా అది గ‌డిచిపోయిన గ‌తం క‌నుక జూనియ‌ర్ ఎన్‌టీఆర్ కూడా త‌న‌ను మ‌రిచిపోయాడ‌ని.. ల‌క్ష్మీపార్వ‌తి ఆవేద‌న వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version