అబ్బో.. పోకిరి లాంటి ట్విస్టా..!

-

పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కలిసి చేస్తున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ కాంబినేషన్ లో మొదటి సినిమాగా వస్తున్న ఇస్మార్ట్ శంకర్ పై ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది. పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన పూరికి ప్రస్తుతం సినిమాలు లేకుండా అయ్యింది. ఇస్మార్ట్ శంకర్ తో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్న పూరి తన సూపర్ హిట్ ఫార్మిలా పోకిరిని ఫాలో అవుతున్నాడట.

అంటే ఇస్మార్ట్ శంకర్ లో కూడా పోకిరిలానే ఓ అదిరిపోయే ట్విస్ట్.. ఆడియెన్స్ ఊహించని ట్విస్ట్ ఒకటి ఉంటుందట. పోకిరి వచ్చాక మళ్లీ అలాంటి ట్విస్టులు అంటే కామన్ అయ్యింది. మరి ఐస్మార్ట్ శంకర్ పోకిరి సీక్వలా.. లేక అదే కథను కొద్దిగా మార్చి చేస్తున్నడా అన్న డౌట్స్ వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమా అటు పూరికి, రామ్ కు ఇద్దరు హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఛార్మి నిర్మాణ భాగస్వామ్యం అయిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version