బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ ఫోన్.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా

-

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు సినీ నటుడు నందమూరి తారకరత్న. ఉదయం కుప్పం సమీపంలోని వరదరాజ స్వామి ఆలయంలో పూజల తరువాత మసీదులో ఆయన ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలో లోకేష్ తో పాటు తారకరత్న కూడా పాల్గొన్నారు. అనంతరం మసీదు నుంచి బయటకు వచ్చిన తర్వాత టిడిపి కార్యకర్తల తాకిడి పెరిగింది.

పాదయాత్రలో నడుస్తున్న సమయంలో తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. అయితే తారకరత్నకు గుండెపోటు వచ్చినట్లు తెలిపారు వైద్యులు. తారకరత్నకు గుండె నాళాల్లో ఎక్కువ బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించారు. యాంజియోగ్రామ్ ద్వారా బ్లాక్ లు తొలగించారు. రేపటికి గాని పరిస్థితి చెప్పలేమన్నారు వైద్యులు.

తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రిలో స్వయంగా పర్యవేక్షిస్తున్నారు నందమూరి బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఈ నేపథ్యంలో తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బాలకృష్ణకు ఫోన్ చేసి ఆరా తీశారు జూనియర్ ఎన్టీఆర్. అయితే తారకరత్న ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని బాలకృష్ణ ఎన్టీఆర్ కి వివరించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కాగా కాసేపట్లో తారకరత్నను మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలిస్తామని చెప్పారు బాలకృష్ణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version