Breaking : అభిమాని ఆరోగ్యం విషయం.. వెంటనే స్పందించిన ఎన్టీఆర్‌..

-

శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన జనార్దన్ జూనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమాని ఆక్సిడెంట్ అయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అనారోగ్యం తో ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అయితే.. తన అభిమానికి కష్టం వస్తే నేనున్నానంటూ జూ.ఎన్టీఆర్‌ స్పందించారు. జనార్థన్‌ అనే ఎన్టీఆర్‌ అభిమాని ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే గత మూడు రోజులుగా తన కొడుకు కన్నుకూడా తేరవడం లేదంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ జనార్థన్‌ తల్లి.. తాను ఎంతగానే అభిమానించే ఎన్టీఆర్‌ గొంతు వింటేనన్నా జనార్థాన్‌ లేస్తాడేమనని ఆశతో ఎన్టీఆర్‌ స్పందించాలంటూ వీడియో తీసి సోషల్‌మీడియాతో ఎన్టీఆర్‌కు పంపారు.

అయితే వెంటనే స్పందించిన ఎన్టీఆర్‌.. తన టీంను సంబంధింత ఆసుపత్రికి పంపించడమే కాకుండా.. తానే స్వయంగా జనార్థాన్‌ తల్లితో మాట్లాడారు. అంతేకాకుండా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చికిత్స పొందుతున్న జనార్ధన్‌తో మాట్లాడి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఎన్టీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version