తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు జీతాలను పెంచుతూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నెల వేతనం రూ.15 వేల నుంచి… రూ. 28719 కి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ పెంచిన జీతాలను జూలై మాసం ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నట్లు స్పష్టం చేసింది ప్రభుత్వం. అలాగే జూనియర్ పంచాయితీ కార్యదర్శుల ప్రోబిషన్ పీరియడ్ నాలుగు సంవత్సరాలకు పెంచుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ఎన్ రఘునందర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయంపై జూనియర్ పంచాయతీ కార్యదర్శులు హర్షం వ్యక్తం చేశారు. తమ శ్రమకు ప్రతి ఫలానికి తగ్గట్టు తెలంగాణ ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుందని పంచాయతీ కార్యదర్శులు పేర్కొన్నారు. ఇక ముందు కూడా అదే స్పూర్తితో పని చేస్తామని తెలిపారు.