ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ వస్తుంది, వాటి వలన చాలా మంది ఎన్నో ప్రయోజనాలను పొందుతూ ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేకమైన పథకాన్ని తీసుకురావడం జరిగింది, అదే రాజీవ్ యువ వికాస పథకం. ఈ పథకం నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎవరైతే ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటారో, వారు ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. రాజీవ్ యువ వికాస పథకం జూన్ 2న ప్రారంభమవుతుంది మరియు ఈ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు రుణం మంజూరు అవుతుంది.
ఈ పథకానికి 16 లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు మరియు అర్హులైన లబ్ధిదారులకు జూన్ 2 నుండి జూన్ 9 మధ్యలో రుణం మంజూరు అవుతుంది. రాజీవ్ యువ వికాస పథకం ద్వారా 50,000 నుండి 5 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. రుణం విలువ లబ్ధిదారులు ప్రారంభించే వ్యాపారం ప్రకారం నిర్ణయించబడుతుంది. దరఖాస్తు చేసుకునే వారి సిబిల్ స్కోర్ తో పాటుగా ఇతర ప్రమాణాలను కూడా పరిశీలిస్తారు. ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని పొందాలంటే, రుణాల మంజూరుకు సంబంధించిన ఇంటర్వ్యూకు వెళ్లాల్సి ఉంటుంది. దీనిలో అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాల ప్రకారం రుణాలు మంజూరు అవుతాయి.
ఈ పథకం ద్వారా తెలంగాణలోని యువతకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీని ద్వారా నిరుద్యోగ యువత సంఖ్య తగ్గుతుంది మరియు వారికి ఉపాధి కలుగుతుంది. దీనికి సంబంధించిన లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇంటర్వ్యూలు నిర్వహించిన తర్వాత అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో కొనసాగుతుంది. లబ్ధిదారుల అందరి ఇంటర్వ్యూ పూర్తి చేసిన తర్వాత, అర్హుల వివరాలకు సంబంధించిన లిస్టును విడుదల చేస్తారు మరియు దాని తర్వాత లబ్ధిదారులు రుణాన్ని పొందవచ్చు.