జీవీఎల్ నరసింహ రావు: సముద్రాన్ని నిర్లక్ష్యం చేస్తే.. విశాఖ వాసులు గొంతు కోసినట్టే..!

-

సముద్రాన్ని నిర్లక్ష్యం చేశారంటే విశాఖవాసులు గొంతు కోసినట్లు అనే సంచలన వ్యాఖ్యలు చేశారు బిజెపి ఎంపీ నరసింహారావు. ఇప్పటికైనా సరే స్థానిక ప్రజాప్రతినిధులు మేలుకోవాలని అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ విశాఖ అంటే ముందుగా గుర్తొచ్చేది సముద్రం. విశాఖపట్నం ఆర్థిక వ్యవస్థకు మూలం సముద్రం అని అన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం విశాఖ తీరాల పట్ల నిర్లక్ష్యం చేస్తుందని అది బాధాకరమని అన్నారు.

నగరంలోని వ్యర్ధాలు డ్రైనేజీ ద్వారా నేరుగా వచ్చే సముద్రంలో కలుస్తున్నాయి విశాఖలో సముద్ర తీర ప్రాంతం వ్యర్థంతో పూర్తిగా నిండిపోతుందని అన్నారు. విశాఖలో పర్యాటక రంగాన్ని 10 రెట్లు పెంచొచ్చు కానీ ఇటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయమని అన్నారు. కాలుష్యం కారణంగా 30 ఏళ్ల వ్యవస్థలో 3.4 కిలోమీటర్ల సముద్ర తీరం కుదించకపోయిన పోయిందని అన్నారు సముద్ర తీరాన్ని నిర్లక్ష్యం చేశారంటే విశాఖ భవిష్యత్తులో నిర్లక్ష్యం చేసినట్లే అన్నారు

Read more RELATED
Recommended to you

Latest news