Chhattisgarh Encounter: చత్తీస్గడ్, నారాయణపూర్ జిల్లాలో భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతులలో మావోయిస్టుల పార్టీకి చెందిన అగ్ర నాయకులు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. మరికొందరు మావోయిస్టులు తప్పించుకోగా వారికోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సలైట్లను టార్గెట్ చేస్తూ ఎన్కౌంటర్ చేస్తున్నారు. మావోయిస్టులు లొంగి పోకపోతే అటాక్ చేసి టార్చర్ పెడుతున్నారు. ఇందులో భాగంగానే చత్తీస్గఢ్ లో ప్రత్యేకంగా ఆపరేషన్ నిర్వహించి మావోయిస్టులను హతమారుస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఎన్కౌంటర్ లో తాజాగా నలుగురు మావోయిస్టులు చనిపోయారు. చనిపోయిన మావోయిస్టులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.