టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ అనారోగ్య సమస్యలతో ఈ నెల 2న కన్నుమూశారు. అయితే.. ఇప్పుడు ఆయన సతీమణి నెల రోజుల కూడా కాకుండా మరణించారు. కె.విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి ఆదివారం నాడు గుండెపోటుతో మృతి చెందారు. ఆమె ఈరోజు అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు జయలక్ష్మి.
ఇదిలా ఉంటే.. ఈ నెల 2న గత కొంత కాలంగా వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలో బాధపడుతున్న కళాతపస్వి కె.విశ్వనాథ్ కూడా తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశారు. విశ్వనాథ్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అయితే.. ఇప్పుడు ఆయన సతీమణి మరణించడంతో మరోసారి ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.