పాలకుల నిర్లక్ష్యం మునుగోడు శాపంగా మారింది : కేఏ పాల్‌

-

మనుగోడులో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నిన్నటితో నామినేషన్‌ల ప్రక్రియ ముగిసింది. అయితే.. చివరి రోజు నామినేషన్లు వేసేందుకు పలు పార్టీల నేతలు క్యూ కట్టారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. రేవంత్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, కేఏ పాల్ సారథ్యంలోని ప్రజాశాంతి పార్టీలో చేరిన ప్రజా గాయకుడు గద్దర్ మునుగోడు నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం చేశారు. అయితే, చివరి నిమిషంలో ఆయన మనసు మార్చుకోవడంతో అధినేత కేఏ పాల్ స్వయంగా బరిలోకి దిగి నామినేషన్ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. తమ పార్టీ అభ్యర్థిగా గద్దర్‌ను నామినేషన్ వేయకుండా అధికార పార్టీ నాయకులు బెదిరించారని ఆరోపించారు. గద్దర్ నామినేషన్ వేయకున్నా తన పాట ద్వారా పార్టీకి మద్దతు ఉంటుందని చెప్పారని అన్నారు కేఏ పాల్. తాను నామినేషన్ వేసేందుకు రాకుండా అధికారులు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. పాలకుల నిర్లక్ష్యం మునుగోడు శాపంగా మారిందని, అభివృద్ధికి నోచుకోక వెనకబాటుకు గురైందని అన్నారు కేఏ పాల్. ప్రజలు తనను గెలిపిస్తే మునుగోడును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని పాల్ హామీ ఇచ్చారు కేఏ పాల్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version