గులాబీ పార్టీకి కల్వకుంట్ల కవిత దూరమైన నేపథ్యంలో…. కేఏ పాల్ కీలక ప్రకటన చేశారు. బీసీల కోసం పోరాడుతున్న కల్వకుంట్ల కవిత వెంటనే తమ పార్టీలో చేరాలని కేఏ పాల్ కోరారు. ప్రజాశాంతి పార్టీలో చేరితే.. కల్వకుంట్ల కవితకు మంచి భవిష్యత్తు ఉంటుందని.. వీడియో ద్వారా వెల్లడించారు. కల్వకుంట్ల కవిత తమ పార్టీలోకి వస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని కూడా పేర్కొన్నారు.

ఇది ఇలా ఉండగా.. కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. గులాబీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత.. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా కేసీఆర్ ఫ్యామిలీ పై విమర్శలు చేశారు. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పై కల్వకుంట్ల కవిత సీరియస్ అయ్యారు.