కాంగ్రెస్ కు బిగ్ షాక్… కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ అనుబంధ INTUC సింగరేణి కార్మికులు చేరనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తరువాత బీఆర్ఎస్ పార్టీలో పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు ఉకంటి ప్రభాకర్, 300 మంది సింగరేణి కార్మికులు చేరనున్నారు.

కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు ఉకంటి ప్రభాకర్, 300 మంది సింగరేణి కార్మికులు… బీఆర్ఎస్ పార్టీలో చేరడం చాలా మంచి పరిణామం అంటున్నారు. ఇక అటు కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. గులాబీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత.. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా కేసీఆర్ ఫ్యామిలీ పై విమర్శలు చేశారు. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పై కల్వకుంట్ల కవిత సీరియస్ అయ్యారు.
కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న కాంగ్రెస్ అనుబంధ INTUC సింగరేణి కార్మికులు
మధ్యాహ్నం 3 గంటలకు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు ఉకంటి ప్రభాకర్, 300 మంది సింగరేణి కార్మికులు pic.twitter.com/lwspTzoaVW
— Telugu Scribe (@TeluguScribe) September 3, 2025