బీఆర్ఎస్ పార్టీకి, కల్వకుంట్ల కవితకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు, కల్వకుంట్ల కవిత వెనుక తానులేనని.. వాళ్లలో వాళ్లే కత్తులు పట్టుకుని పొడుచుకుంటున్నారని.. బాంబు పేల్చారు సీఎం రేవంత్ రెడ్డి. చేసిన పాపాలు ఎక్కడికీ పోవూ…ఆనాడు అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా జైళ్లకు పంపారని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

ఈరోజు దోచుకున్న అవినీతి సొమ్ము పంపకాల్లో గొడవలు వచ్చి కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారు…నేను ఆ చెత్త గాళ్ల వెనక ఎందుకు ఉంటాను? అని కౌంటర్ ఇచ్చారు. నేను నా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం నాయకుడిగా ముందుంటా అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో తెలుగుదేశం పార్టీని కెసిఆర్… చంపేశాడని ఫైర్ అయ్యారు. ఎంతోమంది నాయకులను పెద్ద స్థాయికి తీసుకువెళ్లింది తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేసారు.