BREAKING : ఢిల్లీలో కేఏ పాల్‌ మౌనదీక్ష

-

ఢిల్లీ రాజ్ ఘాట్ లో కేఏ పాల్ మౌనదీక్ష చేయనున్నారు. తెలుగురాష్ట్రాల విభజన చట్టాన్ని అమలు చెయ్యాలని పాల్ దీక్ష చేస్తున్నారు. 12 గంటల నుండి 3 గంటల వరకు దీక్ష చేయనున్నారు కేఏ పాల్. 8 ఏళ్లుగా విభజన హామీలను కేంద్రం,ప్రధాని మోడీ అమలు చేయడం లేదని.. విభజన హామీలు అమలు కాలేదు, అందుకే రాజ్ ఘాట్ లో మౌన దీక్ష చేస్తున్నానని చెప్పారు కే ఏ పాల్.

జీవితంలో మొట్ట మొదటిసారిగా రాజ్ ఘాట్ లో మూడు గంటల పాటు మౌన దీక్ష చేస్తున్నానని.. నాతోపాటు మూడు గంటల పాటు దీక్ష చేయలేని వారు మూడు నిముషాలైనా దీక్ష పాటించండని వెల్లడించారు.

ఈరోజు 2కోట్ల10 లక్షల మంది నాతో పాటు ఉపవాసం ఉంటున్నారు.. విభజన హామీల అమలు కోసం వచ్చే బుధవారం ఉదయం జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడతానని పేర్కొన్నారు. విభజన హామీలు అమలు చేయకపోయే ఆగస్టు 15 తరువాత ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని.. తెలుగు ప్రజల సత్తా చూపకపోతే విభజన హామీలు అమలు కావని స్పష్టం చేశారు కే ఏ పాల్.

Read more RELATED
Recommended to you

Exit mobile version