తెలుగు ప్రజలు నిరుత్సాహ పడొద్దు : కేఏ పాల్

-

త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్‌ పర్యటించనున్నారు. సెప్టెంబర్ లో హైదరాబాద్ లో తెలుగు ప్రజలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తానని కే ఏ పాల్‌ వెల్లడించారు. అంతేకాకుండా.. విభజన హామీల అమలు కోసం తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం పోరాడాలని కే ఏ పాల్‌ అన్నారు. రెండు రాష్ట్రాల్లో 2 కోట్ల మంది వరద బాధితులున్నారు ..కానీ ఆదుకునే నాయకుడు లేడు అని కే ఏ పాల్‌ వెల్లడించారు. తెలంగాణలో నేను అధికారం లోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు,పంట నష్టపోయిన వారికి ఆర్ధిక సాయం, వరద బాధితులకు సహాయం చేస్తానన్నారు.

తెలుగు ప్రజలు నిరుత్సాహ పడొద్దని కే ఏ పాల్‌ అన్నారు. తెలుగు రాష్ట్రాల న్యాయం జరిగేందుకు అందరితో కలిసి పోరాటం చేస్తామని, త్వరలో భారత్ లో ప్రపంచ ఆర్థిక సదస్సు జరగబోతుందని కే ఏ పాల్‌ తెలిపారు. హైదరాబాద్, అహ్మదాబాద్ లో సదస్సు ఉంటుందని, ప్రపంచ దేశాల అధ్యక్షులు వ్యాపారవేత్తలు ,పెట్టుబడిదారులు ఆర్ధిక సదస్సుకు హాజరవుతారన్నారు. ఎకనమిక్ సమ్మిట్ తో 8 లక్షల కోట్ల పెట్టుబడులు దేశానికి రానున్నాయన్నారు. ఏపీ తెలంగాణ కు నాలుగు లక్షల కోట్లు,గుజరాత్ కి నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version