కడప మాజీ ఎమ్మెల్యే కందుల శివానంద రెడ్డి కన్నుమూశారు. గుండెపోటుతో ఈ తెల్లవారు జామున ఆయన తుది శ్వాస విడిచారు. 1989లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే గా గెలిచారు కందుల శివానంద రెడ్డి. ఆ తరువాత టీడీపీలో చేరిన ఆయన 2004,2009 ఎన్నికల్లో కడప ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. రాజశేఖరరెడ్డి రాజకీయ శత్రువుగా ఉన్న కందుల శివానందరెడ్డిని వైఎస్ మరణం తర్వాత మళ్లీ కాంగ్రెస్ లోకి తీసుకొచ్చారు.జగన్ ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి శివానంద రెడ్డి ని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు,
రాష్ట్ర విభజన అనంతరం శివానందరెడ్డి తిరిగి టీడీపీలో చేరారు. వైఎస్, కందుల కుటుంబానికి 1977నుంచే రాజకీయ వైరం ఉంది. కందుల కుటుంబానిది పులివెందుల నియోజకవర్గమే అయినా కడపలో స్థిరపడ్డారు. ఆయనకు కందుల గ్రూప్స్ పేరుతో పలు విద్యాసంస్థలు ఉన్నాయి.