దక్షిణాది అందాల నటి కాజల్ అగర్వాల్ ఇప్పుడు ప్రేమలో పడిందని, ఆమెకు పెళ్లి కళ వచ్చేసిందని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. కాజల్ దక్షిణాదిలో ముఖ్యంగా కోలీవుడ్, టాలీవుడ్‌లో ప్రముఖ కథానాయకిగా వెలుగుతున్న నటి ఈ ఉత్తరాది బ్యూటీ. అయితే ప్రస్తుతం ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి అనే కంటే టాలీవుడ్‌లో ఒక్క అవకాశం కూడా లేదు అని చెప్పడమే కర్కెట్. అయితే తాజాగా, సముద్రపు ఒడ్డున నిలబడి తన రెండు చేతులనూ కలుపుతూ, లవ్ సింబల్ ను కాజల్ చూపించగా, ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ప్రస్తుతం కమల్ హాసన్ సరసన ‘ఇండియన్-2’ చిత్రంలో నటిస్తున్న ఆమె, ఆ సినిమా పూర్తి కాగానే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కాజల్, తనకు ఇంట్లో పెద్దలు సంబంధాలు చూస్తున్నారని చెప్పింది. ఎటువంటి భర్త కావాలన్న విషయంలో చాలా పెద్ద లిస్ట్ నే తయారు చేసుకుని పెట్టుకున్న ఆమె, ఓ వ్యాపారవేత్తతో పీకల్లోతు ప్రేమలో ఉందన్న వార్తలు కూడా వచ్చాయి. అప్పట్లో వాటిని ఖండించిన ఆమె, ఇప్పుడు తాజాగా పెట్టిన ఫోటో వైరల్ అవుతుండటంపై మాత్రం ఇంకా స్పందించలేదు.