బీఆర్ఎస్ నేతలకు పిక్నిక్ స్పాట్‌గా కాళేశ్వరం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

కాళేశ్వరంను పిక్నిక్ స్పాట్ చేశారు. అప్పుడు పిక్నిక్ వెళ్లారు. ఇప్పుడు కూడా పిక్నిక్ కే వెళ్లారు అని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ..’94 వేల కోట్లు ఖర్చు చేసి 93 వేళ ఎకరాలకు నీళ్లు ఇచ్చారు అని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ నేతలకు పిక్నిక్ స్పాట్‌గా మారింది.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రాజెక్ట్ కుంగిపోయింది అని తెలిపారు. ఇదే విషయమై నివేదిక ఇచ్చిన ఎన్డీఎస్ఏ పై కూడా బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోయినప్పుడు కేసీఆర్ ఎందుకు నోరు మెదపలేదు అని ఆయన ప్రశ్నించారు.బ్యారేజ్‌లలో ఎవరూ 16 టీఎంసీల నీరు నిల్వ చేయరు అని..బ్యారేజ్‌లలో నీరు నిల్వ చేయొద్దు అని ఎన్డీఎస్ఏ చెప్పింది అని తెలిపారు. కాళేశ్వరం గేట్లు మూసేస్తే దిగువన ఉన్న ప్రాజెక్టులతో పాటు భద్రాచలం మునుగుతాయి. ఎల్లంపల్లిలో రేపటినుంచి పంపింగ్ మొదలు పెడతాం అని తెలిపారు. అసలు నీళ్లు వదలాలని బీఆర్ఎస్ నేతలు తమకు ఇస్తున్న వార్నింగ్‌లను చూస్తుంటే నవ్వొస్తుంది అని ఆయన ఎద్దేవా చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version