KALKI: ‘బుజ్జీతో భైరవా’.. రామోజీ ఫిల్మ్ సిటీ లో ఈవెంట్

-

ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న బుజ్జీని పరిచయం చేసేందుకు ‘కల్కి’ మేకర్స్ వేదికను ఫిక్స్ చేశారు. రేపు సాయంత్రం 5 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈవెంట్లో ‘కల్కి’ మూవీ కోసం తయారుచేసిన స్పెషల్ కారును రివీల్ చేస్తారు. ‘భైరవా, బుజ్జీని కలుసుకోండి’ అంటూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ మూవీ జూన్ 27న విడుదల కానుంది.

కాగా, సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాని మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో తెరెకెక్కుతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం లో అమితాబ్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణే, దిశా పటానీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్ట‌ర్స్, గ్లింప్స్‌ల‌కు మంచి స్పందన వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version