”ఆర్‌ఆర్‌ఆర్‌” రికార్డును బ్రేక్ చేసిన కల్కి మూవీ

-

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కల్కి 2898 ఏడీ ఈరోజు థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను రాబట్టింది.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. కేవలం ఉత్తర అమెరికాలో ప్రీమియర్ల ద్వారా ఆల్-టైమ్ రికార్డును నెలకొల్పి అపూర్వమైన మైలురాయిని సాధించింది.

ఈ మూవీకి సంబంధించి అమెరికాలో అడ్వాన్స్ సేల్స్ దిమ్మదిరిగిపోయేలా సాగుతున్నాయి. ఇప్పటికే ”ఆర్‌ఆర్‌ఆర్‌” పేరిట ఉన్న మునుపటి రికార్డును అధిగమించింది. ఈ చిత్రం 3.7 మిలియన్ల డాలర్ల వసూళ్లను రాబట్టింది. తద్వారా ప్రీమియర్స్‌ ద్వారా అత్యధిక వసూళ్లు రాబట్టిన ”ఆర్‌ఆర్‌ఆర్‌” (3.46 మిలియన్ డాలర్లు) రికార్డును ఈ మూవీ బ్రేక్ చేసింది. దీంతో ప్రభాస్‌ మరో సరికొత్త చరిత్ర సృష్టించాడు.

కాగా, ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, పశుపతి , రాజేంద్ర ప్రసాద్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించాడు. ఈ పౌరాణిక సైన్స్ ఫిక్షన్ ను వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Latest news