Kalki: ఇటలీలో ప్రభాస్, దిశా పటాని రొమాంటిక్ సాంగ్ షూట్….

-

మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ . సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో వస్తోన్న ఈ సినిమాని మే 9 న 2024లో రిలీజ్ కానుంది.వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో వచ్చి ట్రెండ్‌ సెట్టర్స్‌గా నిలిచిన జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి చిత్రాలు మే 9 న రిలీజైన సంగతి తెలిసిందే.ఈ చిత్రం లో అమితాబ్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణే, దిశా పటానీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ‘కల్కి 2898AD’ సినిమా గురించి బోలెడు వార్తలు వస్తుండగా…. తాజాగా ప్రభాస్, దిశా పటాని తో రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేయబోతున్నారు.తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ఇక ఆ ఫొటోలో అందమైన సముద్రం ఒడ్డున కెమెరా కనిపిస్తుంది. ఈ ఫోటో ఇటలీలో జరుగుతున్న కల్కి సినిమా సెట్స్‌లోనిది అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ అండ్ దిశా మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news