Breaking : ప్రముఖ కమెడియన్‌పై తెలంగాణ ప్రభుత్వానికి నటి ఫిర్యాదు

-

ముంబై ప్రత్యేక కోర్టు వెలువరించిన సంచలన తీర్పు.. ఇద్దరు టాలీవుడ్‌ సెల్రబిటీల మధ్య మాటల యుద్ధం రాజేసిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఈ ఇద్దరు టాలీవుడ్‌ సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు నెట్టింట వైరలవుతున్నాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సమంతకు అక్కగా నటించిన కల్పిక గణేశ్ టాలీవుడ్ యువ కమెడియన్ అభినవ్ గోమటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇటీవల కల్పిక గణేశ్ ఓ కార్యక్రమంలో ఉత్తమ సహాయనటి అవార్డు అందుకుంది. అయితే, అభినవ్ గోమటం తనను ఐటెం అంటూ అవమానకరంగా వ్యాఖ్యానించాడని మండిపడుతోంది కల్పిక.

అంతేకాదు, అభినవ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కల్పిక డిమాండ్ చేసింది. ఈ క్రమంలో ఆమె తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ట్యాగ్ చేస్తూ, అభినవ్ పై చర్యలు తీసుకోవాలని కల్పిక కోరింది. అటు, అభినవ్ గోమటం మాత్రం సారీ చెప్పేందుకు ససేమిరా అంటున్నాడు. కల్పిక ఉద్దేశపూర్వకంగానే తనను టార్గెట్ చేసిందని కల్పిక ఆరోపిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version