Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తరుముకొస్తున్న తరుణంలో… కీలక పరిణామం తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి PJR కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డితో కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. దాదాపు అరగంటకుపైగా ఇద్దరి భేటీ కొనసాగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కవిత పోటీ చేస్తుంది అన్న వార్తలు వస్తున్న తరుణంలో ఇరువురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడం బీఆర్ఎస్ పార్టిలో చేరిన విష్ణు ప్రస్తుతం బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. కాగా… కేటీఆర్‌తోనే నా ప్రయాణం అంట ఇప్పటికే విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. నేను ఎప్పుడు చెప్పినా ఇదే చెబుతానన్నారు. కేటీఆర్‌కు ప్రమోషన్ ఉంటది..నాకు ప్రమోషన్ ఉంటదని వివరించారు జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్‌రెడ్డి.