రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ అంగన్వాడీ టీచర్లు నిరసనకు దిగారు. కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించారు అంగన్వాడీ టీచర్లు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేవారు.. ప్రీ ప్రైమరీ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు అంగన్వాడీ టీచర్లు.

అయితే…. పరిస్థితి అదుపు తప్పేలా ఉందని… అంగన్వాడీ టీచర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇది ఇలా ఉండగా… తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి, ఉత్తమ్ కుమార్ యాదవ్ పాల్గొననున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనంతరం రెండు విడతల్లో ఎన్నికలను నిర్వహించేందుకు ఈ సమావేశంలో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు హైకోర్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది.