తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి యూటర్న్ తీసుకున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని నిన్న ప్రకటించిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఇప్పుడు మాట మార్చేశారు. నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని ఎక్కడ అనలేదని కుండబద్దలు కొట్టారు. ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానం మాత్రమే ఇచ్చానని.. కానీ రాజకీయాల్లో ఉంటానని వివరించారు.

దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు ఓపెన్ చేస్తానని చెప్పానని తప్ప రాజకీయాలకు దూరంగా ఉంటానని ఎక్కడ చెప్పలేదని వివరించారు. దీంతో మల్లారెడ్డి వ్యాఖ్యలు మరోసారి హార్ట్ టాపిక్ అయ్యాయి. ఇక నిన్న తనకు ఈ రాజకీయాలు వద్దే వద్దు అంటూ బాంబు పేల్చారు. కాలేజీలు నడుపుకుంటూ ప్రజా సేవ చేస్తానని వివరించారు. అయితే ఈ ప్రజాసేవ అనే పదాన్ని.. చెప్పకుండా.. ఆయన రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నారని నిన్నటి నుంచి అన్ని చానల్స్ లో వార్తలు వచ్చాయి.