కళ్యాణం కమనీయం మూవీ రివ్యూ..!

-

సంక్రాంతి బరిలో ఏకంగా నాలుగు పెద్ద స్టార్లు తమ సినిమాలతో పోటీపడుతుంటే.. పోటీకి చిన్న సినిమాగా వచ్చి మంచి హిట్ కొట్టే ప్రయత్నం చేశారు సంతోష్ శోభన్.. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా.. అనిల్ కుమార్ ఆళ్ళ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈరోజు థియేటర్లలో విడుదలైంది.. జనవరి 11వ తేదీన తెగింపు, 12న వీరసింహారెడ్డి, 13న వాల్తేరు వీరయ్య అలాగే 14న వారసుడు సినిమాలు రిలీజ్ అయిన నేపథ్యంలో ఇంత పెద్ద స్టార్ హీరోలతో పోటీపడానికి సంతోష్ శోభన్ తన కళ్యాణం కమనీయం సినిమాను రిలీజ్ చేశారు. అయితే మరి పోటీ తట్టుకొని నిలబడ్డాడా లేక ఎప్పటిలాగే ఫ్లాప్ ని చవి చూశాడా అనేది ఇప్పుడు చూద్దాం.

ప్రీమియర్ షో ద్వారా వచ్చిన టాక్ గురించి ప్రస్తావించినట్లైతే.. సంతోష్ శోభన్ ఈసారి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు అని స్పష్టమవుతుంది. కామెడీ, ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీగా వచ్చిన ఈ చిత్రం మొదటి భాగం కామెడీగా అనిపించినా రెండవ భాగం మాత్రం ఎమోషనల్ సన్నివేశాలతో ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయారు. సంతోష్ శోభన్ తనదైన నటనతో ముద్ర వేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా మళ్లీ ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఈ సినిమా చాలా రొటీన్ గా మొదలై చివరి వరకు ఆసక్తి లేని కొన్ని సన్నివేశాలతో ప్రేక్షకులకు నీరసం తెప్పిస్తుంది. థియేటర్లలో బోర్ ఫీల్ అవుతారు అంటూ చూసిన అభిమానులు తెలుపుతున్నారు.

హీరో తన పరిస్థితిని వివరించడానికి ప్రయత్నించే కొన్ని సన్నివేశాలు అలాగే ఉద్యోగం కోసం అతని ప్రయత్నాలను ప్రదర్శించే సన్నివేశాలు ఏదో ఒక రకంగా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. చాలా సింపుల్ కథాంశం తో ఆసక్తి లేని సన్నివేశాలతో ఈ సినిమా ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తోంది. మొత్తానికి అయితే ఆయన మళ్లీ సక్సెస్ పొందలేదని తెలుస్తోంది. మరి ఆయన వచ్చే సినిమాతోనైనా తన ఉనికిని చాటుకుంటాడో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version