‘భారతీయుడు-2’పై మరోసారి స్పందించిన కమల్ హాసన్..ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

-

విశ్వనటుడు కమల్ హాసన్ ప్రస్తుతం ‘విక్రమ్’ ఫిల్మ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి అన్ని చోట్ల సానుకూల స్పందన వస్తోంది. ప్రేక్షకులు థియేటర్లలో ఈ పిక్చర్ చూసి ఫిదా అవుతున్నారు. కాగా, ‘విక్రమ్’ ఫిల్మ్ ప్రమోషన్స్ లో, మీడియా తో చిట్ చాట్ సందర్భంగా కమల్ హాసన్ కు ప్రతీసారి ‘భారతీయుడు-2’ గురించి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.

ఇటీవల ‘ఇండియన్-2’ పిక్చర్ గురించి కమల్ హాసన్ వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మళ్లీ ‘భారతీయుడు-2’ సినిమా గురించి లోకనాయకుడిని ప్రశ్నించగా, ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను, శంకర్ కాంబోలో వస్తున్న ‘భారతీయుడు-2’ చిత్రం ఆగిపోలేదని స్పష్టం చేశారు.

కరోనా విపత్తు, సెట్ లో జరిగిన ప్రమాదం వలన సినిమా షూటింగ్ ఆగిపోయిందని తెలిపారు. లైకా ప్రొడక్షన్స్ హౌజ్ వారు కూడా శంకర్ ను సంప్రదిస్తున్నారని చెప్పారు. ఒకే సినిమా కోసం పదేళ్ల పాటు టైం స్పెండ్ చేయలేమని అందుకే వేరే ప్రాజెక్టులు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. శంకర్ కు, తనకు ఓన్ ప్రొడక్షన్ హౌజెస్ ఉన్నాయని అందులో వర్క్ చేస్తున్నామని తెలిపారు. కమల్ వ్యాఖ్యలతో ‘భారతీయుడు-2’ సినిమా షూటింగ్ పున:ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టమవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version