తమిళ హీరో కార్తీ హీరోగా నటించిన ఖైదీ చిత్రం తెలుగులో అనువదమై మంచి విజయాన్ని దక్కించుకుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. హీరోయిన్ లేకుండా పాటలు లేకుండా సినిమాలు సక్సెస్ అవుతాయా అన్న ప్రశ్నకి సరైన కంటెంట్ తో చెప్పగలిగితే సక్సెస్ చేసి చూపించొచ్చు అని తెలియజేసిన సినిమా ఇది. ఐతే ఈ సినిమా అనంతరం లోకేష్ కనగరాజ్, విజయ్ తో సినిమా మొదలెట్టాడు.
మాస్టర్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది. కరోనా లేకపోయుంటే ఈ పాటికి రిలీజై ఉండేది. ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే మాస్టర్ ఇంకా రిలీజ్ కాకుండానే లోకేష్ కనగరాజ్ కి మరో మంచి అవకాశం వచ్చింది. లోక నాయకుడు కమల్ హాసన్ తో సినిమా ఓకే అయ్యింది. ఈ మేరకు నేడు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కమల్ హాసన్ 232వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ లుక్ విడుదలైంది. రాజ్ కమల్ ఫిలిమ్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో రూపొందనున్న ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.