పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య భీకరపోరు సాగుతోంది. ఇక ఇజ్రాయెల్ వరుస దాడుల్లో పాలస్తీనా పౌరులు మరణిస్తున్నారు. శనివారం రాత్రి గాజాలోని జబాలియా ప్రాంతంలోని శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో 29 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. గాజాపై మొన్నటివరకు దాడులు నిలిపివేసిన తాజాగా హమాస్ లక్ష్యంగా విరుచుకపడుతోంది.
ఈ క్రమంలోనే గాజాలోని ప్రజలు ఆహారం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహరీస్ పేర్కొన్నారు.‘దాదాపు రెండు వారాలుగా ఉత్తర గాజాలోకి ఎలాంటి ఆహారం వెళ్లలేదని ఐక్యరాజ్యసమితి తెలిపింది. అవసరమైతే వారికి ఆహారం అందేలా ఇజ్రాయెల్ అత్యవసరంగా యుద్ధాన్ని నిలిపివేయాలి. పౌరులను రక్షించాలి. ఆహారం, నీరు, మెడిసిన్స్ వారికి అందించాలి. మానవతా చట్టాన్ని గౌరవించండి’ అని ట్వీట్ చేశారు.