కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పై తెలంగాణ హైకోర్టు కేసులు కొట్టేసింది. ఇక పూర్తి వివరాలు లోకి వెళితే.. 1999, 2003లో నకిలీ డీడీల తో బంగారం కొనుగోలు చేశారని, కందికుంట వెంకటప్రసాద్ పై రెండు కేసులు నమోదు చేసింది సిబిఐ. ఒక కేసులో ఐదు సంవత్సరాలు అలానే మరో కేసులో ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ అప్పట్లో తీర్పు ఇచ్చిన నాంపల్లి సిబిఐ కోర్టు.
సిబిఐ కోర్టు తీర్పుపై తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
అలానే కేసులు కొట్టివేయడం తో కందికుంట వెంకటప్రసాద్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం కూడా దొరికింది. ఇప్పటికే టిడిపి రెండవ జాబితా లో మాజీ ఎమ్మెల్యే భార్య యశోదా దేవికి టిక్కెట్ ఇచ్చింది అధిష్టానం.