నా ఫుల్ సపోర్ట్ రాజమౌళికే.. సర్‌ను ఏమైనా అంటే ఊరుకునేది లేదు: కంగనా రనౌత్‌

-

నా ఫుల్ సపోర్ట్ మీకే అంటూ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి మద్దతుగా నిలిచింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. సోషల్‌ మీడియాలో జక్కన్నపై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఈ బ్యూటీ మండిపడింది. ఆయనను ఏమైనా అంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చింది. రాజమౌళి వర్షంలోనూ కణకణ మండే అగ్నిలాంటివారని ప్రశంసించింది.

ఇటీవల ‘ది న్యూయార్కర్‌’ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి..  ‘‘మా కుటుంబంలో అందరు మత విశ్వాసాలను నమ్ముతారు. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం, తీర్థయాత్రలు చేయటం, కాషాయం ధరించి సన్యాసిలా జీవించా. కొందరు స్నేహితుల వల్ల క్రైస్తవ మతాన్ని కూడా అనుసరించా. బైబిల్‌ చదివా. చర్చికి వెళ్లా. ఇవన్నీ చూసిన తర్వాత ‘స్వలాభం కోసమే మతం’ అన్న విషయం అర్థమైంది. నా కజిన్‌ ద్వారా అయాన్‌ రాండ్‌ ‘ది ఫౌంటెన్‌ హెడ్‌’, ‘అట్లాస్‌ ష్రగ్డ్‌’ చదివాను. వాటి నుంచి ఎంతో స్ఫూర్తి పొందా. ఆమె నిగూఢమైన ఫిలాసఫీ నాకు అర్థం కాలేదు కానీ, అందులోని ప్రాథమిక విషయాలు అర్థమయ్యాయి. అప్పటి నుంచి మతానికి దూరంగా జరుగుతూ వచ్చా.’’ అని అన్నారు.

మతంపై రాజమౌళి అభిప్రాయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు విమర్శలు చేయటం మొదలు పెట్టారు. జక్కన్నపై ట్రోలింగ్ చూసి కంగనా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ వరుస ట్వీట్‌లు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version